మద్యం షాపుల దరఖాస్తులకు నేడు ఆఖరు
మద్యం షాపుల దరఖాస్తులకు నేడు ఆఖరు
ఎక్సైజ్ ఎస్సై సోమశేఖర్
ప్యాపిలి, అక్టోబర్ 10, (సీమకిరణం న్యూస్) :
మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారంమే తుది గడువని డోన్ ఎక్సైజ్ ఎస్సై సోమశేఖర్ గురువారం తెలిపారు. ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి ఆదేశాల మేరకు ప్యాపిలి పట్టణం పోలీస్ స్టేషన్ నందు ఎస్సై మధుసూదన్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోన్ నియోజకవర్గనికి 16 మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. డోన్ ఆరు , ప్యాపిలి మూడు, బేతంచర్ల ఏడు మద్యం దుకాణాలు మంజూరయ్యాయి అన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో 249 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్యాపిలి మండలానికి సంబంధించి ఒక్కొక్క షాపుకి 65 లక్షలు కేటాయించడం జరిగిందని ఈ సొమ్మును ఆరు విడతలుగా చెల్లించాలన్నారు. నేటితో చివరి రోజు కావున దరఖాస్తులు చేసే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సేంజ్ ఎస్సై సోమ శేఖర్ తెలిపారు.