జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 11, (సీమకిరణం న్యూస్):
అమ్మవారి అనుగ్రహంతో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, కర్నూలు జిల్లా సుభిక్షంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.