విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి : జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి : అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
అనంతపురం కలెక్టరేట్, పెద్దవడుగూరు, మార్చి 15, (సీమకిరణం న్యూస్) :
మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పెద్దవడుగూరు, యాడికి మండలాలలో జరిగే పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసేపల్లి లో ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి కూలీలతో ముచ్చటించారు. ఉపాధి కూలీల సంబంధించిన జాబ్ కార్డు ను పరిశీలించారు. అనంతరం ఏ.తిమ్మాపురం నందు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త సేకరణను ప్రతిరోజు చేపట్టాలన్నారు. గ్రామాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని ట్రై సైకిల్స్ ఉన్నాయి, ఎంత చెత్త వస్తోంది ఆరా తీశారు. ఏ.తిమ్మాపురం లోని అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అంగన్ వాడీ సిబ్బందిని ఆదేశించారు. నిర్ణీత సమయంలో అంగన్ వాడీల పరిధిలోని పిల్లల కొలతలను ఖచ్చితంగా తీసుకోవడం ద్వారానే పౌష్టికాహార లోపాన్ని జయించగలమన్నారు. అంగన్ వాడీల్లో వివిధ రిజిస్టర్ నిర్వహణ తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. భోజనాన్ని పరిశీలించారు. నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ని, రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ఈ మార్చి నెల ఆఖరి లోపల భవన నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్రిష్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మధ్యాహ్నం భోజనం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా భోజనం తిన్నారు. వంటగదిని మరో చోటికి మార్చాలని పాఠశాల హెడ్ మాస్టర్ ను ఆదేశించారు. తరగతులు నిర్మాణం కొరకు నాడు- నేడు కార్యక్రమం ద్వారా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్ నుఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రవి కుమార్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.