కర్నూలులో మౌర్య హాస్పిటల్ ప్రారంభం
కర్నూలు వైద్యం, అక్టోబర్ 26, ( సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగరంలోని దేవ నగర్ రోడ్డులో మౌర్య హాస్పిటల్ ను శనివారం రాష్ట్ర మంత్రులు టిజీ భరత్, ఎన్ఎండి ఫరూక్, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మౌర్య హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఎం రాజేష్ కుమార్, డాక్టర్ కంచర్ల హరిప్రసాద్, డాక్టర్ వసీం హసన్ రాజా షేక్, డాక్టర్ ఎం. రఘు ప్రవీణ్ లు మాట్లాడుతూ రోగులకు తక్కువ ఖర్చుతో ఖచ్చితత్వం కలిగిన రోగనిర్ధారణ పరీక్షలు మరియు రికవరీ సమయం తగ్గించడం కోసం సరికొత్త సాంకేతికతను ఉపయోగించి అత్యంత అధునాతన చికిత్సా ఎంపికలతో రోగులకు సేవలందించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊబకాయం, మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలు, మానసిక రుగ్మత వంటి జబ్బులతో పాటు గర్భిణీ మహిళల కోసం 24 గంటల అత్యవసర వైద్య సేవలు వైద్య నిపుణుల పర్యవేక్షణలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.