BREAKING NEWSHEALTHSTATE
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా.కె.వెంకటేశ్వర్లు
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా.కె.వెంకటేశ్వర్లు
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డా.కె.వెంకటేశ్వర్లు
విధులలో పారదర్శకంగా పని చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
డా.కె.వెంకటేశ్వర్లు
కర్నూలు వైద్యం, అక్టోబర్ 29, (సీమకిరణం న్యూస్):
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డా.కె.వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైద్యులు మరియు పరిపాలన సిబ్బంది స్వాగతిస్తూ ఆయనను శాలువా వేసి పూల బోకే తో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ఆసుపత్రిలో మీకందరికీ కూడా నేను సుపరిచితుడేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులలో పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఆసుపత్రి సెక్యూరిటీ మరియు శానిటేషన్ ముఖ్యంగా పలు విభాగాలలో పారిశుద్ధ్య పనులపై ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలన్నరు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనమందరం విధులలో అలసత్వం వహించకుండా సమయానికి కార్యాలయాలకు వెళ్లేలా చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.చిట్టి నరసమ్మ, సి టి వి ఎస్ హెచ్వోడి డా.ప్రభాకర రెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా.శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, కేఎంసి ఏడి అనిల్ కుమార్ రెడ్డి, జిజిహెచ్ ఏడి రమేష్ బాబు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.