రాష్ట్ర బడ్జెట్ స్వర్ణాంధ్రకు సాకారం
ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుంది
మాజీ మంత్రి బుగ్గన బడ్జెట్ నిరాశ పరిచిందనడం సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
డోన్ ప్రతినిధి, నవంబర్ 11, (సీమకిరణం న్యూస్):
శాసనసభలో కూటమి ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తుందనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి అభివర్ణించారు. బడ్జెట్ పై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలందరికి ప్రయోజనము పొందే బడ్జెట్ ను ప్రకటించడం గమనార్హం అని సూపర్ సిక్స్ పథకాలకు కూడా బడ్జెట్ లో డబ్బులు కేటాయించడం జరిగిందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం,చేనేత, మరియు కులవృత్తులకు బడ్జెట్ లో పెద్దపీట వేసిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పై పూర్తి దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నిరాశ పరిచిందని మాట్లాడటం సిగ్గుచేటు గత 2019ఎన్నికలలో 151సీట్లతో మీరు అధికారంలోకి వచ్చి మోసపూరిత పాలనతో విసిగిపోయిన ప్రజలు 2024ఎన్నికలలో 11సీట్లకే ప్రజలు పరిమితం చేసిన ఇంకా మీకు బుద్ది రాలేదని అన్నారు. మీరు గత వైసిపి ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా ఉన్నపుడు ఉద్యోగస్తులకు నెలలో 10వ తారీకు అయిన కూడా జీతాలు పడేటివి కాదనీ, ఒకసారి ఉద్యోగస్తులను అడితే మీ గురించి చెప్తారని అన్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని మీ నాయకుడు కానీ, మీకు కానీ మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వంలో పేపర్లకు పరిమితమైన బడ్జెట్ పెట్టడం జరిగిందని శాసనసభకు హాజరు కానీ వైసిపి ఎమ్మెల్యేలు కానీ వైసిపి నాయకులు కానీ బడ్జెట్ పై మాట్లాడే హక్కలేదన్నారు.