BREAKING NEWSCRIMEHEALTHPOLITICSSPORTSSTATE

మధుమేహంపై అవగాహన అవసరం

మధుమేహంపై అవగాహన అవసరం
డయాబెటాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చంద్రశేఖర్
జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో ఘనంగా డయాబెటిక్ డే సదస్సు
ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్బంగా ప్రత్యేక డయాబెటిక్ హెల్త్ చెకప్
ఈ నెల14 నుంచి డిసెంబర్ 13 వరకు డయాబెటిక్ హెల్త్ చెకప్ ప్యాకేజీ
ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు వైద్యం, నవంబర్ 14, (సీమకిరణం న్యూస్):
మనిషి జీవనశైలిలో మార్పుల కారణంగా అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని, అందులో మధుమేహం ఒకటని, దీనిపై అవగాహన పెంచుకుని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ ఎండి , సీఈవో , డయాబెటాలజిస్ట్ , జనరల్ ఫిజీషియన్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. స్థానిక కొత్త బస్టాండ్ నందు గల జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో వరల్డ్ డయాబెటిక్ డే ని పురస్కరించుకొని డయాబెటిక్ డే పై ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకప్పుడు 50 ఏళ్ల తర్వాత వచ్చే మధుమేహం ఇప్పుడు జీవనశైలి,ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాల  వల్ల 20 నుంచి 30 ఏళ్ల వాళ్లకు కూడా వస్తున్నదని తెలిపారు. మధుమేహంపై ప్రజలు అవగాహన పెంచేందుకు అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య 2006 నుంచి వరల్డ్ డయాబెటిక్ డే ను నిర్వహిస్తుందని 1972లో సర్ ప్రెడరిక్ బాంటింగ్ ఇన్సులిన్ కనిపెట్టడంతో ఆయన పుట్టినరోజు నవంబర్ 14న వరల్డ్ డయాబెటిక్ డే గా జరుపుకుంటారని తెలిపారు. డయాబెటిక్ ని స్క్రీనింగ్ ద్వారా కనిపెట్టిన వెంటనే కొద్దిపాటి ఆహారపు అలవాట్లు మార్చుకొని శారీరక శ్రమను పెంచితే డయాబెటిక్ ను అదుపులో ఉంచుకోవచ్చని చెప్పారు. ప్రతినెల పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల పర్యవేక్షణలో మందులు సక్రమంగా వాడాలని తెలిపారు. ప్రతి ఏటా మధుమేహ బాధితులు పెరుగుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా  నవంబర్ 14న జరుపుకునే వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా తమ హాస్పిటల్ వారు డయాబెటిక్ హెల్త్ చెకప్ ప్యాకేజీ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. కేవలం 499 రూపాయలకే తినక ముందు తిన్న తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ , హెచ్ బి ఏ వన్ సి , లిపిడ్ ప్రొఫైల్ , సీరం క్రియాటిన్, జనరల్ ఫిజీషియన్, డయాబెటిక్ కన్సల్టేషన్ లు అందిస్తున్నామని తెలియజేశారు. యొక్క ప్యాకేజ్ 14 నవంబర్ నుంచి 13 డిసెంబర్ 2024 వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఈవో డాక్టర్ చంద్రశేఖర్, హాస్పిటల్స్ డైరెక్టర్స్ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రవిబాబు, డాక్టర్ రాఘవేంద్ర, మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ రామ్మోహన్, హాస్పిటల్ సిఓఓ డాక్టర్ గణేష్, ఆపరేషన్స్ హెడ్ నదీమ్, ఆపరేషన్ ఎజిఎం డాక్టర్ కృష్ణవేణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!