నేటి బాలలే రేపటి పౌరులు
నేటి బాలలే రేపటి పౌరులు
ది ఓరియన్ స్కూల్ కరెస్పాండెంట్ రమణ
ఓరియన్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కరెస్పాండెంట్ రమణ
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 14, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగరంలోని వివిఎస్ ఫంక్షన్ హాల్ రోడ్డులోని శ్రీ సాయినాథ్ నగర్ లో ఉన్న ది ఓరియన్ స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ది ఓరియన్ స్కూల్ కరెస్పాండెంట్ రమణ పాఠశాల విద్యార్థులకు నెహ్రూ గొప్పతనాన్ని వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రమణ మాట్లాడుతూ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామన్నారు. బాలలు చదువుతోపాటు క్రీడలు, మిగిలిన అన్ని రంగాల్లోనూ ముందుండాలన్నారు. చదువుతోనే మన నడవడిక ముడిపడి ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా నృత్యం, విజ్ఞానం, ఆటలు, పాటలు లాంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన చిన్నారులకు పాఠశాల కరెస్పాండెంట్ రమణ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.