కర్నూలులో కిలో చికెన్ రూ.100
చికెన్ కోనేందుకు బారులు తీరిన జనం
కర్నూలు ప్రతినిధి, నవంబర్ 24,(సీమకిరణం న్యూస్) :
స్థానిక మద్దూర్ నగర్ లోని షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ మటన్ చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఒకరికి మించి మరొకరు పోటీపడి కిలో చికెన్ ధర రూ.100 కు తగ్గించారు. దీంతో కొనుగోలుదారులు చికెన్ కొనేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ తనకు సొంత ఫారం ఉందని, తెలుగుదేశం పార్టీ భారీ మోజార్టీతో గెలిచినందుకు పార్టీపై అభిమానంతో ప్రజలకు రూ.100కే చికెన్ విక్రయిస్తున్నానని తెలిపారు. అలాగే కర్నూలు ఎమ్మెల్యే టీజీ. భరత్ కు మంత్రి పదవి వరించినందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. సుభాన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ కార్తీకమాసం కావడంతో చికెన్ కొనుగోలుదారులకు తనవంతుగా తగ్గింపు ధరలకు అందిస్తున్నామని తెలిపారు.