వెల్దుర్తి వాసులను వరించిన కీలక పదవులు
వెల్దుర్తి వాసులను వరించిన కీలక పదవులు
వెల్దుర్తి, నవంబర్ 24, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ఆర్యవైశ్య సంఘంలో వెల్దుర్తికి చెందిన పలువురిని కీలక పదవులు వరించాయి. అందులో భాగంగా ఆర్యవైశ్య సంఘ జనరల్ సెక్రటరీగా వెల్దుర్తికి చెందిన అత్తు లూరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. యువజన విభాగంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా వేముల శేషు, జిల్లా సెక్రెటరీగా చాటకొండ కార్తీక్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికైన వారందరూ ప్రమాణ స్వీకారం చేశారు. కీలక పదవులు జిల్లా వాసులకు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సాయి చాటకొండ మద్దయ్య అత్తులూరి సుబ్రమణ్యం మారుతి ఐడియా శివ క్యాంటీన్ మురళి అశోకు అమ్మవారి శాల శీను కమ్మ గిరి చంటి పాలూరు మద్దయ్య ముచ్చర్ల కాంతు కేవీ శేష పని ఎస్ఎస్ఆర్ రాజు సంతోష్ చిన్ని శ్రీనివాసులు చిన్న సుధాకర్ చిన్ని ప్రసాదు తిరివీధి లక్ష్మణస్వామి శ్రీకాంత్ కే మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.