మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్
మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్
కర్నూలు క్రైమ్, నవంబర్ 27, (సీమకిరణం న్యూస్) :
స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ వృద్ధుడు రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుండగా గమనించిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా వృద్ధులు దగ్గరికి వెళ్లి రోడ్డు దాటించి మానవత్వం చాటుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రత్యేక చొరవ చూపడం హర్షించదగ్గ విషయమని పలువురు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న సమయంలో అక్రమంగా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, 16 ద్విచక్ర వాహనాలు గుర్తించడం పట్ల విధుల పట్ల ఆయనకున్న నిబద్ధత ఏంటో అర్థమవుతుందని నాడు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు కూడా. ఖాజా హుస్సేన్ బదిలీల్లో భాగంగా ఇటీవలే వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నుండి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు.