ANDHRABREAKING NEWSPOLITICSSPORTSSTATE
ఘనంగా హెరాల్డ్స్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు

ఘనంగా హెరాల్డ్స్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 23, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగర శివారులో ఉన్న ఇడ్లీ హోటల్ సమీపంలోని హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ పౌలూస్ విద్యార్థులను ఉద్దేశించి క్రిస్మస్ గొప్పతనాన్ని వివరించారు. అలాగే కరుణామయుడైన యేసు ప్రభువు లోక రక్షకుడు శాంతి మార్గాన్ని ప్రబోధించాడని తెలిపారు.
మంచి మార్గంలో నడవడం కోసం మార్గం చూపిన వాడిగా ఏసుక్రీస్తును కొనియాడారు. పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా యేసు పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ తో పాటు ప్రిన్సిపల్ టీచర్లు తల్లిదండ్రులు మరియు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మరీయట్ట తోపాటు ఉపాధ్యాయులు అనీ, నవీన, భాగ్యలక్ష్మి, రేష్మా ,విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.