
కర్నూలు జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 24, (సీమకిరణం న్యూస్):
జిల్లాలో ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
“ఏసుక్రీస్తు” ప్రంపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూత అని కలెక్టర్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. క్రిస్మస్ వేడుకలు ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని, ఇంటింటా అనంద కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాల్లో జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శత్రువులను మిత్రులుగా మార్చి, వారు శాంతి మార్గంలో పయనించేలా ప్రేమను చూపారని, వారి మార్గం అందరికీ ఆదర్శనీయమని, ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించాలని కలెక్టర్ కోరారు.