
రక్తదానం ప్రాణదానంతో సమానం
కర్నూలు డి.ఎస్.పి.బాబు ప్రసాద్
గ్లోబల్ టౌన్షిప్, గ్లోబల్ కంప్యూటర్స్ అధినేతలు ఎస్.ఖాజా మాలిక్, ఎస్ ఖాజా అలి ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం
కర్నూలు టౌన్, డిసెంబర్ 31, (సీమకిరణం న్యూస్):
రక్తదానం ప్రాణదానంతో సమానమని కర్నూలు డి.ఎస్.పి.బాబు ప్రసాద్ అన్నారు. మంగళవారం గ్లోబల్ టౌన్షిప్, గ్లోబల్ కంప్యూటర్స్ అధినేతలు ఎస్.ఖాజా మాలిక్, ఎస్ ఖాజా అలి ఆధ్వర్యంలో అక్షయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్త దాన శిబిరాన్ని కల్లూరు రోడ్ లోని గ్లోబల్ టౌన్షిప్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డి.ఎస్.పి.బాబు ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి.బాబు ప్రసాద్, గ్లోబల్ టౌన్షిప్ అధినేత ఖాజా మాలిక్ మాట్లాడుతూ రక్తదానంతో మరొకరి జీవితానికి వెలుగును నింపవచ్చని తెలిపారు. సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. రక్తం దానం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిదని రక్త దానం ప్రాముఖ్యత వివరించారు. పెద్ద ఎత్తున యువత పాల్గొని రక్త దానం చేశారు.