
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు రెండు నెలల పొడిగింపు
జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జి. రాజకుమారి
నంద్యాల కలెక్టరేట్, డిసెంబర్ 31, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల (గుర్తింపు కార్డు) గడువును మరో 2 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ జి. రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీతో అక్రిడేషన్ కార్డుల గడువు ముగిసినందున మీడియా అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు అక్రిడేషన్ల గడువును పొడిగిస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.