
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి
కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
పదవి విరమణ పొందిన డిపిఓ ఎఓ, ఫ్యాక్షన్ జోన్ కానిస్టేబుల్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్ డిసెంబర్ 31 (సీమకిరణం న్యూస్):
ప్రభుత్వ వృత్తిలో భాగంగా పదవీ విరమణ పొందిన ప్రతీ ఒక్కరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. మంగళవారం పదవి వీరమణ పొందిన జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలన అధికారి సి. రత్నకుమార్, ఫ్యాక్షన్ జోన్ కానిస్టేబుల్ ఎస్. పెద్ద గౌస్ లను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. పోలీసు శాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ సమయంలో ప్రతీ ఉద్యోగికి సంతోషం, బాధ రెండు ఉంటాయన్నారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. హుస్సేన్ పీరా, ఆర్ ఐ నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, ఎస్పీ సిసి సాకేత్, అడిషనల్ ఎస్పీ సిసి మంజుల పాల్గొన్నారు.