అవగాహనతోనే వినియోగదారుల్లో చైతన్యం..
ప్రపంచ వినియోగదారుల దినోత్సవంలో జిల్లా ఫోరం జడ్జి వసంతకుమార్
స్మార్ట్ సిటీ కన్స్యూమర్స్ ఫెడరేషన్ కాకినాడ
ఫోటో: జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా వినియోగదారుల ఫోరం జడ్జి
ప్రతిభా పాటవాలు చూపిన విద్యార్థినులకు ప్రశాంతతా పత్రాలు బహుకరణ.
కాకినాడ కలెక్టరేట్, మార్చి 15,( సీమకిరణం న్యూస్) :
భారతప్రభుత్వం 1986లో చేపట్టిన వినియోగదారుల రక్షణ చట్టం 2019లో నవీకరణ జరిగిన చట్ట ప్రయోజనాల గురించి పౌరులు విద్యార్థి దశ నుంచే అవగాహన పొందాలని తూర్పు గోదావరి జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి వసంత కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కాకినాడ ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల మీటింగ్ హాలులో సామాజికవేత్త దూసర్ల పూడి రమణరాజు అధ్యక్షతన స్మార్ట్ సిటీ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. ఫోరం జడ్జి జ్యోతి ప్రజ్వలన నిర్వ హించి జిల్లా పౌర సరఫరా అధికారి ప్రసాదరావు చేతుల మీదుగా విద్యార్థినులకు ప్రశంసతాపత్రాలు అందజేశారు. కమీషన్ సభ్యుకు చాగంటి నాగేశ్వర రావు చక్కా సుశీ రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి హేజీబు శ్రీనివాస రామ కృష్ణ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరి శ్రీనివాసరావు లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమీషనర్ సయ్యద్ సలీం, జవ్వాది సూర్య వెంకట సత్యనారాయణ రెడ్డి విజయ రాజేంద్ర ప్రసాద్ ప్రిన్సిపాల్ కె కరుణ జి నాగ శ్రీకాంత్ భమిడి గిరిజా రమాదేవి సమాచార కేంద్రం కన్వీనర్ భమిడి శివమూర్తి మున్నగువారు పాల్గొన్నారు. జిల్లాలోని 2 కార్పోరేషన్ 7మున్సి పాలిటీ 3 నగర పంచాయతీ ప్రాంతాల్లో చైతన్య ప్రచార జాత నిర్వహించి కన్స్యూ మర్స్ ఫెడరేషన్ కమిటీల ఏర్పాటుతో జిల్లావినియోగదారుల సదస్సు నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. తూనికలు కొలతలు నిర్వహణ డిజిటల్ బ్యాంక్ ఫైనాన్స్ విధానాలపై వర్క్ షాప్ జరిగింది.