
రోడ్డు భద్రత అందరి బాధ్యత
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
కర్నూలు ఆర్టీవో భరత్ చావన్
పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
కర్నూలు క్రైమ్, జనవరి 24, (సీమకిరణం న్యూస్):
రోడ్డు భద్రత అందరి బాధ్యత అని రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కర్నూలు ఆర్టీవో భరత్ చావన్ అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా కర్నూలు మండల పరిధిలోని వెంకయ్య పల్లె గ్రామ సమీపంలో ఉన్న పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో 36 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీవో భరత్ చావన్ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ల కె రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజ నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాబు కిషోర్, ఆధ్వర్యంలో పుల్లయ్య కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు విద్యార్థినులకు మరియు సిబ్బందికి, కాలేజ్ బస్ డ్రైవర్స్ మరియు క్లీనర్లు కు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీవో భరత్ చవాన్, కర్నూల్ ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్, లు మాట్లాడుతూ విద్యార్థులు బైక్ పోటీలు పెట్టుకొని అతివేగంతో ద్విచక్రనా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు కొలిపోయి, కొంతమంది కాళ్లు చేతులు విరిగి అంగవైకల్యంతో ఏ పనులు చేసుకోలేక ఇంట్లోనే ఉండిపోయి తల్లిదండ్రులకు ఎంతటి క్షోభ పెట్టినవారుగా ఉంటారు. విద్యార్థులు గమనించి మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు ఒక గొప్ప పొజిషన్లో ఉండి మంచి పేరు తీసుకురావాలని ట్రాఫిక్ సిఐ విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన గూర్చి తెలియజేస్తూ ద్విచక్ర వాహనాదారులు లైసెన్స్ కలిగి ఉండి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాలుగు చక్రాల వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. అధిక వేగం రాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు. ముఖ్యంగా వాహనాదారులు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు. వాహనాదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి బుక్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా వాహనాల్లో ఉంచుకొని వాహనాలు నడపాలని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శశికుమార్ ఆర్టీవో భరత్ చావ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవీంద్ర కుమార్, నాగరాజా నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాబు కిషోర్, తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామాంజనేయులు, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, హోంగార్డులు పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు.