
జిల్లా పోలీసు యంత్రాంగం అందించిన సహాకారం మరువలేనిది
జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
బదిలీ పై వెళుతున్న జిల్లా ఎస్పీ గారికి ఆత్మీయ వీడ్కోలు
జిల్లా ఎస్పీ గారిని పూలమాలతో సత్కరించి, శాలువతో సన్మానం చేసిన కర్నూల్ రేంజర్ డిఐజి, ఎస్పీలు, పోలీసు అధికారులు
కర్నూల్ క్రైమ్, జనవరి 24, (సీమకిరణం న్యూస్):
కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్న కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ కి కర్నూలు రాగమయూరి రిసార్ట్ లో కర్నూలు జిల్లా పోలీసు అధికారులు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. కర్నూల్ జిల్లా ఎస్పీ దంపతులను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ శాలువ, పూలమాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో, విధి నిర్వహణలో జిల్లా పోలీసుయంత్రాంగం అందించిన సహాకారం మరువలేనిదని కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ , నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు , కడప జిల్లా ఎస్పీ ఈ జి. అశోక్ కుమార్ , జాయింట్ కలెక్టర్ బి .నవ్య, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, విజిలెన్స్ &ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి చౌడేశ్వరి, హోం గార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు ఉన్నారు.