
26న మాంసం విక్రయాలు నిషేధం..!
కర్నూలు క్రైమ్, జనవరి 24, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26వ తేదీన మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు నగర పాలక ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం రోజున మూసివేయాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో సైతం మాంసాహారం విక్రయించరాదని ఆదేశించారు. నిషేధాజ్ఞలు విస్మరించే వ్యాపారులకు భారీగా జరిమానా విధించడంతో పాటు ట్రేడ్ లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు సహకరించాలని కోరారు.