
మహా శివరాత్రికి 1.20 లక్షల లడ్డూలు
మహానంది, జనవరి 24, (సీమకిరణం న్యూస్) :
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ ప్రసా అందుబాటులో ఉంచుతామని ఈఓ నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతేడాది శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 1.10 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించామన్నారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా 1.20 లక్షల లడ్డూలను సిద్ధంగా ఉంచుతామన్నారు. లడ్డూ ప్రసాదంతో పాటు పులిహోర ఉంటుందన్నారు. ప్రస్తుతమున్న కౌంటర్లతో పాటు సమాచార కేంద్రం, ఇతర కౌంటర్ల ద్వారా భక్తులకు ప్రసాదాలు విక్రయిస్తామని వెల్లడించారు.