బైక్ పై నుంచి జారి పడి మహిళ మృతి

• బైక్ చక్రానికి చుట్టుకున్న చీర
• కింద పడి మహిళ మృతి
మంత్రాలయం, జనవరి 22, (సీమకిరణం న్యూస్) :
ఆమె చీర కొంగు యమపాశమై ప్రాణం తీసింది. చిన్న పాటి ఏమరపాటుకు నిండు ప్రాణం బలైంది. మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన లక్ష్మన్న, శారదమ్మ. దంపతులు హోటల్ నడుపుకుని జీవనం సాగిస్తున్నారు. బుధవారం హోటల్ సంత నిమిత్తం బైక్పై ఇద్దరు బయలు దేరారు. మాధవరం సూగూరు రోడ్డులోని ఇస్పాత్ మారుతి స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో బైకు వెనుక చక్రంలో శారదమ్మ (40) చీరకొంగు చుట్టుకోవడంతో ఆమె బైక్ పై నుంచి జారి కిందపడింది. ఆమె తలకు తీవ్ర రక్తం గాయం కావడంతో మృత్యు వాత పడింది. హెడ్ కానిస్టేబుల్ ఎ. ఆంజ నేయులు సంఘటన స్థలం చేరకుని ప్రమాద వివ రాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.