
న్యాయ సేవా సదన్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
కర్నూలు క్రైమ్, జనవరి 25, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ న్యాయ సేవా సదన్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి /జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. కబర్ధి ప్రారంభించారు. ఈ శిబిరంరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్స్ మరియు
ఆశ్విని హాస్పిటల్ డాక్టర్స్ మరియు మెడికవర్ డాక్టర్స్ న్యాయాదికారులకు మరియు న్యాయ శాఖ సిబ్బందికి కంటి, పంటి, ఛాతి, ఎముకల పరిక్షలు మరియు బి పి, షుగర్, ఈసీజీ మొదలగు వైద్య పరిక్షలు నిర్వహించారు. ఈ సదస్సులో అడిషనల్ జిల్లా జడ్జిలు పాండు రంగారెడ్డి, భూపాల్ రెడ్డి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మెన్ వెంకట హరినాధ్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శాంతి కల ఇతర న్యాయమూర్తులు, గవర్నమెంట్ డాక్టర్స్ మహమ్మద్ యాసీన్, అజిద్, మెడికవర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ ఇమ్రాన్, పల్మానాలాజీ డాక్టర్ వినోద ఆచారి, అశ్విని హాస్పిటల్ డాక్టర్స్ ప్రియదర్శిని, మల్లికార్జున రెడ్డి, శిరీష హాస్పిటల్ ఆర్థో డాక్టర్ రవితేజ రెడ్డి,స్కిన్ స్పెషలిస్ట్ సత్యశ్రీ రెడ్డి, సుశీల నేత్రలయ డాక్టర్ సుధాకర్, యన్. జి. ఓ. గంగాధర్ రెడ్డి, డెంటల్ డాక్టర్ పశుపతి శర్మ, అపోలో మేనేజర్ రమేష్ వారి టెక్ని షియన్స్ పాల్గొన్నారు.