
హెరాల్డ్స్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
కర్నూలు ప్రతినిధి, జనవరి 26, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగర శివారులోని ఇడ్లీ హోటల్ సమీపంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న హెరాల్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్కూల్ కరస్పాండెంట్ పౌలూస్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పౌలూస్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో గణతంత్ర దినోత్సవం అతి ముఖ్యమైన ఘట్టం అని 1949 నవంబర్ 26న రాజ్యంగ సభ భారత రాజ్యంగాన్ని ఆమోదించిందన్నారు. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజునే గణతంత్ర దినోత్సవం అంటాం. రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. దీంతో దేశానికి స్వాతంత్ర్యం పూర్తిగా లభించింది అన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మరీయట్ట తోపాటు ఉపాధ్యాయులు అనీ, నవీన, భాగ్యలక్ష్మి, రేష్మా ,విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.