జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
– అధ్యక్షులుగా టి.చంద్రశేఖర్, కార్యదర్శిగా కె.విజయ్ కుమార్ ఎంపిక.
కర్నూలు స్పోర్ట్స్ ,మార్చి 15,( సీమకిరణం న్యూస్) :
జిల్లా సాఫ్ట్ బాల్ నూతన కార్యవర్గం ఎన్నికలో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేశవ మూర్తి పర్యవేక్షణలో జిల్లా సాఫ్ట్ బాల్ సమావేశం మాస్టర్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నూతన సాఫ్ట్ బాల్ సంఘం అధ్యక్షులు గా టి. చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎంపికైనారు, నూతన కార్యదర్శి గా కె.విజయ్ కుమార్, కోశాధికారిగా అయ్యన్న గౌడ్, వైస్ ప్రెసిడెంట్ బి.తసిన బేగం, జాయింట్ సెక్రటరీ ఉమ మహేశ్వరి,ఎగ్జిక్యూటివ్ మెంబెర్లు కల్యాణి,ముఖ్య సలహాదారులు సురేంద్ర గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా సంఘం కార్యదర్శి టి. గంగాధర్, రాష్ట్ర పీ.ఈ.టి ల సంఘం సభ్యులు జాకీర్ హుస్సేన్, రాష్ట్ర అసోసియేషన్ తరపున ఎన్నికల పరిశీలకులుగా అనంతపురం సాఫ్ట్ బాల్ సంఘం కార్యదర్శి సి.నాగేంద్ర హాజరయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ సాఫ్ట్ బాల్ క్రీడా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు భవిష్యత్తు లో సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు.