
ఫీజు పోరును విజయవంతం చేయండి
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఫిబ్రవరి 01, (సీమకిరణం న్యూస్):
ఫిబ్రవరి 5న వైఎస్సార్సీపీ చేపట్టే ఫీజు పోరు నిరసన కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పిలుపు నిచ్చారు. శనివారం ఉదయం కర్నూలు నగరంలోని కృష్ణ నగర్ లో ఉన్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి మరియు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలసి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఫీజు పోరు నిరసన కార్యక్రమాన్ని విద్యార్థి విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.