
చిన్నారి కడుపులో కనిపిస్తున్న పిన్నీసు
కర్నూలు వైద్యం, ఫిబ్రవరి 08 (సీమకిరణం న్యూస్):
మూడేళ్ల చిన్నారి తెలియక పిన్నీసు మింగడంతో వైద్యులు చాకచ క్యంగా తొలగించి పునర్జన్మ ప్రసాదించారు. శుక్రవారం స్థానిక మెడికవర్ హాస్పిటల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పి.అబ్దుల్ సమద్ వివరాలు వెల్లడించారు. నగరంలోని మూడేళ్ల చిన్నారి వారం రోజుల క్రితం ఇంట్లో పొరపా టున పిన్నీసును మింగడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ పాపకు ఎక్స్రే తీయగా కడుపులోని చిన్నపేగులో పిన్నీసు ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. అనస్థీషి యాలజిస్ట్ డాక్టర్ బాల ప్రవీణ్ కుమార్ సహకా రంతో డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండోస్కోపీ ద్వారా పిన్నీసును విజయవంతంగా బయటకు తీశారు. కొంత సేపటి తర్వాత పాప కోలుకోవడంతో అదే రోజు డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ అబ్దుల్ సమద్ తెలిపారు.