
జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, మార్చి 29, (సీమకిరణం న్యూస్):
జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరీ, సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.