
జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్
కర్నూలు ప్రతినిధి, మార్చి 29, (సీమకిరణం న్యూస్):
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్ జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి రాష్ట్ర, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు.. ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, అన్ని వర్గాల ప్రజలూ ఆనందంగా ఉండాలన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ పండుగ అని, సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ అని, ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సోదరుల కు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరుల కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని, ముస్లిం సోదర, సోదరమణులందరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని మంత్రి పేర్కొన్నారు.