మంచి ఫలితాలు సాధించిన చిన్న మల్కాపురం విద్యార్థులు

మంచి ఫలితాలు సాధించిన చిన్న మల్కాపురం విద్యార్థులు
మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు
పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం
భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని విద్యార్థులను ఆశీర్వదించిన
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం
డోన్ ప్రతినిధి, ఏప్రిల్ 23, (సీమకిరణం న్యూస్):
పదవ తరగతి ఫలితాలలో డోన్ మండలం చిన్న మల్కాపురం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. పాఠశాల ఫలితాలలో పి .స్ఫూర్తి 572 మార్కులతో మొదటి స్థానాన్ని పొందారు. జి. రోహిత్ 562 మార్కులతో రెండవ స్థానాన్ని, ఎస్. హుస్సేన్ వలి 526 మార్కులతో మూడవ స్థానాన్ని సాధించారు. అలాగే ఈ .మౌనిక 521 మార్కులను, బి .అంజలి 517 మార్కులను, వి .కావేరి 508 మార్కులను, ఎన్ .హర్షిత 502 మార్కులను సాధించారు. పదో తరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం పాఠశాల ప్రధానోపాధ్యాయులు యు. సత్యనారాయణ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చదువుపై అంకితభావంతో ఉండి భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో విజయాలను సాధించాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల సమిష్టి కృషి వల్ల మంచి ఫలితాలను సాధించగలిగారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు.