అమిత్ షా రాజీనామా చేయాలి

కాశ్మీర్ అమానుష ఘటనకు బాధ్యత వహిస్తు “అమిత్ షా ” రాజీనామా చేయాలి
యువ నాయకులు నౌషాద్, డిమాండ్
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 23, (సీమకిరణం న్యూస్):
వివిధ ప్రచార మార్గాల ద్వారా కాశ్మీర్ చల్లదనం కోసం , అక్కడ గొప్పతనం కోసం , కట్టుదిట్ట మైన భద్రత కోసం పర్యాటకుల్ని నమ్మించి రప్పించిన ప్రభుత్వం నేడు జరిగిన అమానుష్య ఘటనకు సమాధానం చెప్పాలి . అందుకు భాద్యత వహించాలి . ఆర్టికల్ 370 రద్దు వట్టి మాటేనా ! ఉగ్రవదాన్ని రాజకీయ అవసరాలకు మోదీ సర్కారే పెంచి పోషిస్తుందా ! అనే అనుమానాలు ప్రజల్ని వెంటాడుతున్నాయి . మోదీ సర్కార్ చాలా బలహీనంగా వుంది . శాంతి భద్రతలను కాపాడ లేకపోతున్నది . మోదీ సర్కార్ గద్దె దిగి ప్రజా తిరిగి తీర్పును కోరాలి . మోదీ , అమిత్ షా లకు రాజకీయ అధికారం మీద వున్న ద్యాశ దేశ భద్రత పై లేకపోవటం ప్రజల దురదృష్టం . భగవంతుడును రాజకీయ ముడి సరుకుగా మార్చుకోవటం పై వున్న దృష్టి మత సామరస్యాన్ని సాధించటం పై లేకపోవటం బాధాకారం . నిత్యం అల్లర్లు , దాడులు, మతోన్మాద ఉగ్రవాదాన్ని ప్రేరేపించటమే మోదీ సర్కార్ ప్రధాన అజెండా గా భారతీయులను భయబ్రాంతులకు గురించేస్తుంద ఆయన తీవ్ర ఆవేదన చెందారు.
కాశ్మీర్ ఉగ్రవాద చర్యను నౌషాద్ తీవ్రంగా ఖండించారు . మృతులకు నివాళిలు అర్పిస్తు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరుస్తుంది . మోదీ రహిత పాలనకై దేశం లో అన్ని రాజకియ పార్టిలు ఒక వేదిక మీదకు రావాలి . ఉద్యమ పార్టిలు లొకిక శక్తులు ఏకం కావలి . భారత్ భద్రత , అభివృద్దే లక్ష్యంగా భారతీయులు ఏకం కావలిసిన తరుణం ఆసన్నమైంది . అంబాని , ఆదాని, విదేశీ కార్పొరేట్ శక్తులకు భారతీయ సంపదను దోచిపెడుతూ, దేశ భద్రతను గాలికి వదిలేస్తున్న మోదీ సర్కార్ ను గద్దె దించాల్సిన గురుతర బాధ్యత ప్రతి భారతీయుని భుజస్కందాలపై వుందని భారకతీయులు బావించాలి . వందేమాతరం నినాదంతో మరో స్వాతంత్రియ పోరాట ఉద్యమానికి సిద్ధ పడదాం అని నౌషాద్ పిలుపునిచ్చారు.
కాశ్మీర్ ఉగ్రవాద చర్యకు భాద్యత వహిస్తు కేంద్ర హోం మంత్రి ” అమిత్ షా ” రాజీనామా చేయాలి . మోదీ సర్కార్ కు దేశ వ్యాప్తంగా మిత్ర పక్షాలుగా కొనసాగుతున్న రాజకీయ అధికార పక్షాలు అన్ని మోదీని విడిచి బయటకు రావాలి . లేకుంటే మోదీ మిత్ర పక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని నౌషద్ హెచ్చిరించారు .
యాహియా కర్నూలు సేవ సమితి నివాళిలు అర్పించిన కార్యక్రమంలో అనిల్, భరత్, చిన్న, సునిల్, వంశీ,రంగ, షాలు తదితరులు పాల్గొన్నారు.