ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సటీకి వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్

ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీగా చంద్రశేఖర్..
ఆమోదం తెలిపిన గవర్నర్
కర్నూలు వైద్యం ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్):
ఎన్డీఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ నియమితులయ్యారు. అయితే, యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సటీకి వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్ పేరును గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సిఫారసు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో వీసీగా చంద్రశేఖర్ నియామకం ఖరారైంది. ఇప్పటి వరకు యూనివర్సిటీకి వీసీగా డాక్టర్ శ్యామ ప్రసాద్ పిగిలం కొనసాగారు. ఇక కొత్త వీసీగా ఎంపికైన చంద్రశేఖర్‌కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.