ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE
సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ చంద్రశేఖర్

సీఎంకు, డిప్యూటీ సీఎం కు, మంత్రి లోకేష్ కు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ పి. చంద్రశేఖర్
కర్నూలు వైద్యం, ఏప్రిల్ 24, (సీమకిరణం న్యూస్):
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చంద్ర శేఖర్ కు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ చంద్ర శేఖర్ నియమితులయ్యారు. తనకు అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, సీఎం చంద్ర బాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, విద్యా, ఐటి శాఖ మంత్రి లోకేష్ కు , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్య కుమార్ యాదవ్ కు డాక్టర్ చంద్ర శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.