
రాయలసీమకు న్యాయం జరిగింది
రిటైర్డ్ డీయస్పీ మహబూబ్ బాషా
డా. చంద్రశేఖర్ ను సన్మానించిన రిటైర్డ్ డీయస్పీ మహబూబ్ బాషా
కర్నూలు ప్రతినిధి, మే 11, (సీమకిరణం న్యూస్) :
సీనియర్ కార్డియాలజిస్ట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగాధిపతి డా.చంద్రశేఖర్ కు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ – చాన్సలర్ పదవి దక్కడంతో రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరిగిందని ఆయత్ ఫౌండేషన్ అధ్యక్షుడు, రిటైర్డ్ డీయస్పీ మహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు డా. చంద్రశేఖర్ ను ఆయన నివాసంలో ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ డా. చంద్రశేఖర్ పరిపాలనాదక్షతను గుర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనను హెల్త్ యూనివర్సిటీ వీసీగా ఎంపిక చేశారని అన్నారు. డా. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో హెల్త్ యూనివర్సిటీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత రుస్తుం ఖాన్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి, వేగా ఫౌండేషన్ అధ్యక్షుడు బోరెల్లి వెంకట రాముడు, సభ్యులు నాగేశ్వరబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.