ANDHRABREAKING NEWSCRIMENEWS PAPERPOLITICSSPORTSSTATE
డి. విష్ణువర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించిన డాక్టర్ శంకర్ శర్మ

కెడిసిసి చైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డిని కలిసిన డాక్టర్ శంకర్ శర్మ
డి. విష్ణువర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించిన డాక్టర్ శంకర్ శర్మ
కర్నూలు ప్రతినిధి, మే 12, (సీమకిరణం న్యూస్):
ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార బ్యాంకు (కేడీసీసీబీ) చైర్మన్‌గా ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎంపిక చేసినందుకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కోడుమూరు టీడీపీ ఇన్‌చార్జి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన నివాసంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలబొకే అందించి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించారన్నారు. ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారి సేవలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కర్నూలు ఉమ్మడి జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డికి పదవిని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.