
జాతీయ వైద్య కమిషన్ సభ్యుడిగా డాక్టర్ చంద్రశేఖర్
కర్నూలు వైద్యం, మే 15, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ వైద్య కమిషన్ సభ్యుడిగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీగా పనిచేస్తున్న డాక్టర్ పి. చంద్రశేఖర్ ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం నుంచి డాక్టర్ కె. బాబి స్థానంలో డాక్టర్ పి. చంద్రశేఖర్ ను నియమించారు. జాతీయ వైద్య కమిషన్ సభ్యుడిగా డాక్టర్ చంద్రశేఖర్ ను నియమించడం పట్ల పలువురు వైద్యు నిపుణులు , ప్రముఖ వైద్యులు కర్నూలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.