ANDHRABREAKING NEWSSTATEWORLD
కుళ్ళిన కోడి గుడ్లు ఉడికి ఉడకని అన్నం.. ఇదేం భోజనం?
కుళ్ళిన కోడి గుడ్లు ఉడికి ఉడకని అన్నం
ఇదేం భోజనం?
అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
రాయలసీమ వీర మహిళ విభాగ కమిటి కో-ఆర్డనేటర్ యస్.ఎం.డి.హసీనా బేగం
కర్నూలు టౌన్, మార్చి 15, (సీమకిరణం న్యూస్) :
మధ్యాహ్న భోజన పథకం అమలు లో అడుగడుగున నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
కుళ్లిన కోడి గుడ్లు, ఉడికి ఉడకని అన్నం కలుషిత నీరే శరణ్యం అవుతోంది అని జనసేన పార్టీ రాయలసీమ వీర మహిళ విభాగ కమిటీ కోఆర్డినేటర్ ఎస్. హసీనా బేగం తీవ్రంగా విమర్శించారు. నిర్వాహకులు పెట్టే అన్నం తినలేక విద్యార్థులు ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్న సంబంధిత అధికారులకు ఏమీ పట్టడం లేదని అన్నారు. నాయకుల సిఫారసులున్న వారికే ఏజెన్సీలు ఒక్కో ఏజెన్సీ చేతిలో 2-3 పాఠశాలలు
సమస్య వచ్చినప్పుడే ఏజెన్సీల రద్దు హడావుడి
అనంతరం పూర్తి బాధ్యతలు మళ్లీ వారికే అప్పా చెబుతున్నారని అన్నారు తప్పు చేస్తున్న పదేపదే వారికి బాధ్యతలు అప్పగించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అని అన్నారు.
‘పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచేందుకు అధికారుల పర్యవేక్షణ కూడా పూర్తిగా కొరవడిందని పేర్కొన్నారు. నాలుగంచెల వ్యవస్థను తీసుకువస్తాం పర్యవేక్షణ బాధ్యతను పాఠశాల అభివృద్ధి కమిటీలో ముగ్గురికి, వారితో పాటు వార్డు, గ్రామ సచివాలయంలో ఉండే విద్య, సంక్షేమ అధికారికి అప్పగిస్తాం.’ అని మధ్యాహ్న భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా పేరు మారుస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలు ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు.
ఉడికీ ఉడకని కూరలు, సంకటిలాంటి అన్నం, కుళ్లిన కోడి గుడ్లు, నీళ్లలాంటి పప్పు, ఇందులో తేలియాడే పురుగులు.. ఇదీ మధ్యాహ్న భోజనం తీరు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రతి పాఠశాలలో సగం మంది విద్యార్థులే భోజనం చేస్తున్నారు మిగతా వారంతా ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకొంటున్నారు అని తెలిపారు. మూడు నెలల్లో 58 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురికాగా నాలుగు ఏజెన్సీలను రద్దు చేశారు అని అయినా ఎలాంటి మార్పు లేదని అన్నారు. ఒక ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది లేదా నేను కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
జగనన్న గోరుముద్దగా పేరు మార్చిన మధ్యాహ్న భోజన పథకంలో అడుగడుగునా నిర్లక్ష్యం తాండవమాడుతోంది కానీ ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ఏజెన్సీలు చెలగాట మాడుతున్నాయి అని ఏటా వందలాది మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రుల పాలవుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప పాలకులు, అధికారులు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో పని చేసే ఏజెన్సీలన్నీ పలువురు ప్రజాప్రతినిధుల సిఫారసులతో కొనసాగుతున్నవేనని, అంచేతనే వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి అయినా ఈ విషయంలో అధికారులు వ్యవహారశైలి ఏ మాత్రం మారడం లేదని అన్నారు. దీనికితోడు నంద్యాల ఘటన మినహా జిల్లాలో ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెబుతుండటం విమర్శల గురవుతోందని అన్నారు. నంద్యాలలో మధ్యాహ్న భోజన పథకంలో వడ్డించిన అన్నం తిని విద్యార్థులు ఆస్పత్రిలో పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలను అధికార పార్టీ నాయకులే నిర్ణయిస్తున్నారు అని రాజకీయ అండదండలతో ఒక ఏజెన్సీ వారే రెండు, మూడేసి పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది అని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత కరువైన కారణంగా చాలామంది విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరారని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులే చెబుతుండటం అందరికీ తెలిసిందే అని అన్నారు. అయినా నిర్వాహకుల తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదని విమర్శించారు. జిల్లా సంబంధిత శాఖాధికారులు తనిఖీలకు వెళ్లినపుడు ముందస్తు సమాచారం కొద్దీ నిర్వాహకులు నాణ్యమైన వంటలు చేస్తున్నారన్నారు.
నిత్యం 100 నుంచి 200 మంది దాకా ఎంతమంది విద్యార్థులున్నా సరే ఏజెన్సీ నిర్వాహకులు 15-20 కేజీల బియ్యమే వండుతున్నారు అని విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలుస్తోందని తెలిపారు. రెండు మూడు వందల మంది విద్యార్థులకు ఇంత తక్కువ భోజనం ఎలా సరిపోతుందని నిర్వాహకులను అడిగితే విద్యార్థులు ఎక్కువ తినరని, పడేస్తారని సాకులు
చెబుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు