
ఆహార నాణ్యతపై రాజీ పడొద్దు
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు కార్పొరేషన్, జూన్ 05, (సీమకిరణం న్యూస్)
అన్న క్యాంటీన్‌లలో ఆహార నాణ్యతపై రాజీ పడొద్దని, ప్రతి రోజూ ప్రజలకు రుచికరమైన భోజనం అందించాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు నిర్వాహకులను ఆదేశించారు. గురువారం ఆయన కొండారెడ్డి బురుజు సమీపంలోని అన్న క్యాంటీన్‌ను అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి అన్న క్యాంటీన్‌కు ఒక నోడల్ అధికారిని నియమించామని, వారు ప్రతి రోజూ ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రతపై తనిఖీ చేస్తున్నారన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించామన్నారు.




