
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 19, (సీమకిరణం న్యూస్):
ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా జరుపుకుంటున్న దీపావళి పండుగ సందర్భంగా ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి,వెలుగులు నిండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పెద్దల సమక్షంలో పిల్లలు బాణాసంచాను కాల్చే విధంగా చూసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా సురక్షితమైన వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




