
రాష్ట్ర, జిల్లా ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు
రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 19, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ రాష్ట్ర,జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేశారు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన దీపావళి పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఐకమత్యం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.ఈ దీపావళి ప్రతి ఇంటికి వెలుగు మాత్రమే కాదు, ఆశ, అభివృద్ధి, సంక్షేమం కూడా తీసుకురావాలన్నారు.. ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులా మారాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని మంత్రి అన్నారు.