
ఉమ్రా యాత్రకు వెళ్తున్న జిలేబి ఖాదర్ బాష దంపతులు
ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన జిలేబి ఖాదర్ బాష
ఖాదర్ బాష దంపతులను శుభాకాంక్షలు తెలిపిన బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, పట్టణ ప్రజలు
ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, గూడూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అస్లాం
“ఉమ్రా ముబారక్!” చెప్పిన సీమకిరణం & కర్నూలు ప్రభ తెలుగు దినపత్రికల ఎడిటర్ షేక్ నజీర్ అహ్మద్ బాష
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 27, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లాలోని గూడూరు మున్సిపాలిటీలో నివాసముంటున్న జిలేబి ఖాదర్ బాష (54) 1985లో జిలేబి వ్యాపారం మొదలుపెట్టారు. ఖాదర్ బాష భార్య పేరు ఖాజాబీ, వీరికి సంతానం ఐదుగురు. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. జిలేబి వ్యాపారం చేస్తూ ముగ్గురు కుమార్తెలకు ఘనంగా పెళ్లిళ్లు చేశారు. ఇద్దరూ కుమారులకు కూడా పెళ్లిళ్లు చేసి కుమారులు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగంలోనే వారికి ఉపాధి కల్పించారు. మొదటి కుమారుడు ఇమ్రాన్ మొబైల్ షాప్ యజమాని.
జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో ఇమ్రాన్ కు మొబైల్ షాప్ ఉంది. రెండవ కుమారుడు తండ్రితో కలిసి షాపును చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గూడూరులో ఖాదర్ భాష అందరికీ సుపరిచితుడు. జిలేబి ఖాదర్ భాషకు గూడూరులో మంచి పేరు ఉంది. ఒక రూపాయి అప్పు లేకుండా ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఒక రూపాయి అప్పు లేకుండా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఉమ్రా యాత్రకు వెళ్లాలని దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారు. ఉమ్రా యాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని మర్కస్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గూడూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అస్లాం మరియు పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి లు హాజరై ఉమ్రాకు బయలుదేరుతున్న ఖాదర్ బాష దంపతులకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి ఉమ్రా యాత్ర విజయవంతంగా సాగాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఎస్ కే పబ్లికేషన్స్ & సీమకిరణం , కర్నూలు ప్రభ తెలుగు దినపత్రికల ఎడిటర్ షేక్ నజీర్ అహ్మద్ బాష జిలేబి ఖాదర్ బాష కు శాలువా కప్పి పూలమాలతో సత్కరించి “ఉమ్రా ముబారక్!” అని అల్లాహ్ మీ ప్రార్థనలను అంగీకరించాలని మరియు మీ యాత్రను సురక్షితంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన వారిలో కర్నూలు 4వ పట్టణ ఏఎస్ఐ షబ్బీర్ అహ్మద్, కర్నూలు రూరల్ సర్కిల్ ఆఫీస్ కానిస్టేబుల్ షేక్ సమీర్ భాష, 19వ వార్డు కౌన్సిలర్ కలాం భాష, ఫర్టిలైజర్ సుభాన్, మన్సూర్, షాషావలి, జావేద్, రషీద్, నిజాం, సంజన్న, కురువ కుమార్, రేపల్లె సంజన్న, కర్నూలు ఫ్రూట్స్ సుభాన్, అక్బర్, కోడుమూరు జగ్గూ భాయ్,కోడుమూరు రవి రెడ్డి, నందికొట్కూరు రజక్ భాష, కర్నూలు బండి రాము, జిలేబి ఖాదర్ బాష అల్లుళ్లు
ఫయాజ్, షేక్షావలి, అమీర్, చిన్న కొడుకు
ఇర్ఫాన్ తో పాటు మొబైల్ బజార్ సురేష్, గఫూర్, లు పాల్గొన్నారు.




