
*ఇన్‌కమింగ్ కాల్స్‌కు వ్యక్తి పేరు.. మార్చికల్లా అందుబాటులోకి!*
మొబైల్‌లోని మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తి కాల్ చేస్తే ఆ వ్యక్తి నంబర్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌పై ప్రస్తుతం ఆధారపడాల్సి వస్తోంది. ఇకపై ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరే ఇన్‌కమింగ్ కాల్స్ సమయంలో మొబైల్ స్క్రీన్‌పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.




