
కోడూరులో పంటపొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్..
మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటపొలాలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పొలాలు నీటిపాలయ్యాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం కోడూరులో పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను స్వయంగా పరిశీలించారు. పంటపొలాల్లోకి దిగి వరి పంటను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ వారికి హామీ ఇచ్చారు.




