
గిద్దలూరు నల్ల బండ బజార్ సమస్యపై ప్రజల ఆవేదన
నల్ల బండ బజార్ మెయిన్ రోడ్డు వద్ద వంతెన ఒడ్డు భాగంలో సిమెంట్ రోడ్డు కుంగిపోవడంతో పెద్ద గుంత ఏర్పడింది. ఆ గుంతలో చెట్ల కొమ్మలు, రాళ్లు పడేసి నిర్లక్ష్యంగా వదిలేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానిక ప్రజలు చెబుతున్నదేమిటంటే — రాత్రి వేళల్లో ఈ గుంత కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నల్లబండ ప్రజలు జిఎంసి అధికారులు గిద్దలూరు ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకుని రహదారిని సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




