హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ భారీ ర్యాలీ
హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ భారీ ర్యాలీ
కర్నూలు టౌన్ , మార్చి 15, (సీమకిరణం న్యూస్) :
హైకోర్టును కర్నూలుకు తరలించాలని కోరుతూ జిల్లా బార్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయస్థానం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు మంగళవారం మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో రాయలసీమ న్యాయవాదుల జేఏసీ, జిల్లా న్యాయవాదుల సంఘం జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది వై. జయరాజు, కో-కన్వీనర్లు కపిలేశ్వరయ్య, నాగలక్ష్మీ దేవి, కె.ఓంకార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య, కార్యదర్శి కరీంలు మీడియాతో మాట్లాడారు. న్యాయవాదులు
రవికాంత్ ప్రసాద్, మురళి, కర్నాటి పుల్లారెడ్డి, సాతర్ల రాజేష్ బాబు, లక్ష్మణ్, నర సింహ, క్రిష్ణమూర్తి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ న్యాయవాదుల జేఏసీ, జిల్లా న్యాయవాదుల సంఘం జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది వై. జయరాజు మాట్లాడుతూ శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హై కోర్టును కర్నూలుకు తరలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించి హైకోర్టును మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి, శాసన సభ స్పీకర్, అన్ని రాజకీయ పార్టీలకు వారు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు.