కర్నూల్ జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. బస్ కోడ్ ఉల్లంఘించే వారిని ఇకపై నేరుగా జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. దేశంలోని అన్ని బస్సులు ఇక ఈ కొత్త బస్ కోడ్కు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ బస్ కోడ్ పూర్తిగా అమలులోకి వస్తే.. భవిష్య త్తులో ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.