
మంత్రి లోకేశ్ పేరుతో లక్షలు కాజేశారు..
AP: సైబర్ నేరగాళ్లు మరోదారుణానికి పాల్పపడ్డారు. మంత్రి నారా లోకేశ్ పేరుతో వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, బాధితులను బెదిరించి రూ.54 లక్షలు కాజేశారు. నిందితుల్లో ఇద్దరిని సీఐడీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలోనే రాజేశ్ A1గా అరెస్ట్ చేశారు. రాజేశు విచారించగా, అతడు ఇచ్చిన సమాచారంతో సాయి శ్రీనాథ్, సుమంత్లను అదుపులోకి తీసుకున్నారు.




