
సుప్రీం ఆదేశాల తర్వాత వేగంగా దర్యాప్తు.. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో వైసీపీ పార్టీ కీలక నేత పీఏ అరెస్ట్
టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక అరెస్ట్
మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరెస్ట్
అదుపులోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులు
సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి ప్రారంభమైన దర్యాప్తు
ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న తొలి నిందితుడు ఇతనే
త్వరలో వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం
టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న (35)ను బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్ట్ చేసింది. ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతంలో జూన్ 4న చిన్న అప్పన్నను సిట్ విచారణకు పిలవడంతో వైవీ సుబ్బారెడ్డి వర్గంలో కలకలం రేగింది. ఆ వెంటనే ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ కొనసాగడాన్ని సవాల్ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.




