పదవి వీరమణ పొందిన ఎస్సై ఎ. మహబూబ్ భాషా

పదవి వీరమణ పొందిన ఎస్సై ఎ. మహబూబ్ భాషా
మహబూబ్ భాషా ను సన్మానించిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, అక్టోబర్ 31, (సీమకిరణం న్యూస్):
సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు అధికారులు పదవి వీరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కోర్టు మానిటరింగ్ సిస్టమ్ లో పని చేస్తున్న ఎస్సై ఎ. మహబూబ్ భాషా శుక్రవారం పదవి వీరమణ పొందారు. ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్సై ఎ. మహబూబ్ భాషా ను శాలువ, పూలమాలతో జిల్లా ఎస్పీ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు, పదవి వీరమణ పొందిన ఎస్సై మహబూబ్ భాషా కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




