గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి ఆత్మీయ స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి ఆత్మీయ స్వాగతం
కర్నూలు కలెక్టరేట్, నవంబర్ 12, (సీమకిరణం న్యూస్):

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు ఎయిర్పోర్ట్ కి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి ప్రజా ప్రతినిధులు ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కి ఉదయం 11 గంటలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలు కర్నూలు ఎయిర్ పోర్టులో తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి రాయలసీమ యూనివర్సిటీ కి బయలుదేరారు.




